Home > జాతీయం > Farmers protest : 6 నెల్లకు సరిపడా రేషన్, డీజిల్‌.. పక్కా ప్లాన్తో రైతన్నలు

Farmers protest : 6 నెల్లకు సరిపడా రేషన్, డీజిల్‌.. పక్కా ప్లాన్తో రైతన్నలు

Farmers protest : 6 నెల్లకు సరిపడా రేషన్, డీజిల్‌.. పక్కా ప్లాన్తో రైతన్నలు
X

లోక్‌సభ ఎన్నికలకు ముందు రైతులు నిరసన తెలుపడం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేసేందుకు సిద్దమయ్యారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు వెనుదిరిగేది లేదని రైతులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం (ఫిబ్రవరి 13) ఢిల్లీ దిశగా రైతులు కదిలారు. ఇవాళ ఉదయం పంజాబ్, హర్యాణా నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో నగరానికి బయలుదేరారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. నిఘా నివేదిక ప్రకారం.. ఒక్క పంజాబ్ రాష్ట్రం నుంచే వందల ట్రాక్టర్లు, వాహనాలు ఢిల్లీకి బయలుదేరాయి. రైతులు వాహనాలతో పాటు ఆరు నెలలకు సరిపడా ఆహారం, డీజిల్, ఇతర సామాగ్రిని వారి వెంట తీసుకొచ్చినట్లు తెలిపారు. కొంతమంది రైతులు మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారు. సుత్తి, రాళ్లు, పనిముట్లతో సాహా ఆరు నెలలకు సరిపడా రేషన్, డీజిల్ తో వచ్చినట్లు చెప్పుకొచ్చారు.

కాగా ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్రం అన్నిరకాల చర్యలు చేపడుతుంది. నెల రోజుల పాటు ఢిల్లీలో 144 సెక్షన్ విధించినట్లుగా కేంద్ర వర్గాలు తెలిపాయి. మార్చి 12వ తేది వరకూ ఢిల్లీలో గట్టి బందోబస్తు మధ్య ఉండనుంది. ఢిల్లీలోకి ఏ రైతు ప్రవేశించకుండా అక్కడుకునేందుకు.. సరిహద్దులను సర్కార్ మూసివేసింది. ఇంకొన్ని సరిహద్దుల వద్ద కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి.. భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. శాంతి, భద్రతల సమస్యలు తలెత్తకుండా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు.

ఢిల్లీలోని సింఘూ, ఘాజీపూర్, టిక్రి ప్రాంతాల వద్ద భారీగా బలగాలను మోహరించింది. ఆ ప్రాంతాల్లో 5 వేల కంటే ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది. అదేవిధంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ట్రాక్టర్ల ప్రవేశానికి అనుమతిని రద్దు చేసింది. తుపాకులు, పేలుడు పదార్థాలు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్‌, సోడా బాటిళ్ల వంటివి దేశ రాజధానిలోకి తీసుకురాకూడదని వాటిపై నిషేధం విధించింది. అలాగే లౌడ్‌ స్పీకర్ల వాడకంపైనా ఆంక్షలు పెట్టింది.

Updated : 13 Feb 2024 4:18 PM IST
Tags:    
Next Story
Share it
Top