Home > జాతీయం > Delhi : రైల్ రోకోను ఉధృతం చేసిన రైతులు

Delhi : రైల్ రోకోను ఉధృతం చేసిన రైతులు

Delhi : రైల్ రోకోను ఉధృతం చేసిన రైతులు
X

దేశరాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే మరో విడత ఢిల్లీ ఛలో నిరసన మార్చ్‌ ను అన్నదాతలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ రైతుల సంఘాలైన సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా రైల్‌రోకోకు పిలుపునిచ్చాయి. దీంతో పంజాబ్, ఢిల్లీ, అమృత్ సర్ లోని రైల్వే ట్రాకులపై దాదాపు నాలుగు గంటల పాటు రైల్ రోకోను నిర్వహిస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధర సహా తమ ఇతర డిమాండ్లను కేంద్రం ఆమోదించాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు.





రైల్ రోకోలో భాగంగా వందలాది మంది రైతులు రైల్వే ట్రాక్ లపై కూర్చొని నిరసన తెలుపుతున్నారు. దీంతో పంజాబ్‌, హర్యానాల్లో 60 చోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే గత నెలలో రైతులు చేపట్టిన రైల్‌రోకోల కారణంగా ఢిల్లీ, అమృత్‌సర్‌ రూట్‌లో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. రైతులు ఆందోళనలు చేస్తున్న రైల్వే ట్రాక్ ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు మార్చ్‌ 6వ తేదీ నుంచి రైతులు చేపట్టిన ‘ఢిల్లీ ఛలో’ ర్యాలీ కొనసాగుతుండటంతో ఢిల్లీ సరిహద్దుల వద్ద పోలీసులు బలగాలు భద్రత పెంచారు. హర్యానాలోని అంబాల జిల్లాలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు.




Updated : 10 March 2024 8:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top