మార్చి 6న ఢిల్లీకి రండి.. 10న ‘రైల్ రోకో’ చేద్దాం: రైతు సంఘాల పిలుపు
X
రైతు సంఘాలు తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేయనున్నాయి. తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ఉద్యమం చేపట్టిన రైతులు.. మార్చి 6న ఢిల్లీలో నిరసన ప్రదర్శనల్లో పాల్గొనాలని, మార్చి 10న దేశవ్యాప్తంగా రైల్ రోకో చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు రైతు సంఘాల నేతలు సర్వన్ సింగ్ పంధేర్, జగ్జీత్ సింగ్ డాల్లేవాల్ ప్రకటించారు. ఇటీవల ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో పలువురు రైతులు మృతి చెందారు. వారి మృతికి సంతాపంగా నిరసన కేంద్రాల వద్ద రైతుల ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని.. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం శంభు, ఖానౌరీ సరిహద్దు ప్రాంతాల దగ్గర పంజాబ్, హరియాణా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మార్చి 6న ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా ఢిల్లీకి చేరుకుని నిరసనల్లో పాల్గొనాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రతి గ్రామం నుంచి ఒక ట్రాక్టర్ ట్రాలీ సరిహద్దు పాయింట్ల వద్దకు రావాలని చెప్పారు.
Krishna
సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.