FASTag KYC: ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువు పెంపు.. ఊరుకున్నారా ఇక ఇక అంతే.. కేంద్రం హెచ్చరిక
X
టోల్ వసూళ్లను మరింత క్రమబద్ధీకరించేందుకు కేంద్ర సిద్ధం అయింది. ఫాస్టాగ్ ల ద్వారా టోల్ చార్జీల చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. కేవైసీ (KYC) పూర్తిచేసుకోని ఫాస్టాగ్ లను నిలిపేసేందుకు సిద్ధం అయింది. అందులో భాగంగా కేవైసీ చేసుకోని ఫాస్టాలను బ్యాంకులు డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేస్తాయని NHAI ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గడువు జనవరి 31తో ముగియాల్సి ఉంది. తాజాగా కేవైసీ గడువు పెంచుతూ.. జాతీయ రహదారుల ప్రాధికారం సంస్థ (NHAI) నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు (ఫిబ్రవరి 29) కేవైసీ ప్రక్రియ పూర్తిచేసుకునే అవకాశం కల్పించింది. ఒకవేళ ఈ గడువులోపు ఈ కేవైసీ చేయకపోతే.. ఫ్టాస్టాగ్ లో బ్యాలెన్స్ ఉన్నా బ్లాక్ లిస్ట్ లేదా డీయాక్టివేట్ చేస్తారు. అందుకే సేవలు కొనసాగేందుకు ఫాస్టాగ్ కు వెంటనే కేవైసీ చేయాలని NHAI అధికారులు సూచించారు. అదనపు సమాచారం కోసం.. టోల్ ప్లాజా లేదా సంబంధింత బ్యాంక్ కస్టమర్ కేర్ సెంటర్ ను సంప్రదించాలని తెలిపింది.
కొందరు వాహనదారులు ఫాస్టాగ్ ను వెహికల్ ముందు భాగంలో పెట్టకుండా.. ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ అతికిస్తున్నారు. అంతేకాకుండా ఒకే ఫాస్టాగ్ ను అనేక వాహనాలకు వినియోగిస్తున్నారు. దీనివల్ల టోల్ ప్లాజాలో ఆలస్యం అవుతుంది. కొన్ని సందర్భాల్లో కేవైసీ పూర్తిచేయకుండానే ఫాస్టాగ్ లు జారీ చేస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అందుకే ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండేందుకు ‘వన్ వెహికల్- వన్ ఫాస్టాగ్’ విధానానికి చర్యలు చేపట్టింది.
మొబైల్లోనే కేవైసీ:
ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ తెలుసుకోవడానికి సంబంధిత వెబ్ సైట్ ను లోకి వెళ్లి లాగిన్ కావాలి. తర్వాత మొబైల్ నంబర్, పాస్ వర్డ్ తో లాగిన్ కావాలి. వెబ్ సైట్ డ్యాష్ బోర్డ్ లో మై ప్రొఫైల్ అని ఉంటుంది. అందులో కేవైసీ స్టేటస్ అని కనిపిస్తుంది. కేవైసీ పూర్తికాకపోతే.. అడిగిన వివరాలు ఇచ్చి ప్రాసెస్ పూర్తి చేయాలి. ఒకవేళ మీ మొబైల్ నంబర్ NHAI దగ్గర రిజిస్టర్ కాకపోయి ఉంటే.. మై ఫాస్టాగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని రిజిస్టర్ కావాలి. ఆ తర్వాత అప్ డేట్ చేసుకోవాలి. బ్యాంకులు జారీ చేసిన ఫాస్టాగ్ లు అయితే.. బ్రాంచ్ కు వెళ్లి మొబైల్ నంబర్ రిజిస్టర్ చేయాలి. తర్వాత కేవైసీ పూర్తిచేసుకోవాలి.