Home > జాతీయం > Ram Mandir : అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లిన ఇమామ్‌కు ఫత్వా

Ram Mandir : అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లిన ఇమామ్‌కు ఫత్వా

Ram Mandir  : అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లిన ఇమామ్‌కు ఫత్వా
X

అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అట్టహాసంగా జరిగింది. మోదీ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అయోధ్య కేసులో ముస్లిం పిటిషనర్ ఇక్బాల్ అన్సారీతో పాటు అఖిల భారత ఇమామ్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్ ఉమర్‌ అహ్మద్‌ ఇల్‌యాసికి కూడా ఆహ్వానం అందింది. ఈ క్రమంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఇల్‌యాసి హాజరయ్యారు. దీంతో తనకు ఫత్వా జారీ అయ్యిందని ఇల్‌యాసి తెలిపారు.

రామమందిరం ప్రారంభోత్సవానికి వెళ్లినందుకు తనకు బెదిరింపులు వచ్చాయని ఇల్‌యాసి చెప్పారు. తన ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో షేర్ చేసి.. మసీద్ అథారిటీలు, ఇమామ్లు తనను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారని ఆరోపించారు. క్షమాపణ చెప్పడంతో పాటు తన పదవికి రాజీనామా చేయాలని బెదిరించారని వాపోయారు. ఈ క్రమంలోనే తనకు ఫత్వా జారీ అయ్యిందని చెప్పారు. కానీ అలా చేసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు.

మత సామరస్యం, దేశం మంచి కోసమే అయోధ్య వెళ్లానని ఇల్‌యాసి వివరించారు. తనకు అయోధ్యలో అపూర్వ స్వాగతం లభిచిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మతం మానవత్వం అని.. కాబట్టి తాను ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధిలో దూసుకెళ్తోందని చెప్పారు. భారత్ విశ్వగురు గురు కావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.


Updated : 30 Jan 2024 11:00 AM IST
Tags:    
Next Story
Share it
Top