Home > జాతీయం > కారు పార్కింగ్ కోసం సీఎం కాన్వాయ్నే అడ్డుకున్న వృద్ధుడు

కారు పార్కింగ్ కోసం సీఎం కాన్వాయ్నే అడ్డుకున్న వృద్ధుడు

కారు పార్కింగ్ కోసం సీఎం కాన్వాయ్నే అడ్డుకున్న వృద్ధుడు
X

సిటీల్లో కార్ పార్కింగ్ బాధలు అన్నీ ఇన్నీ కావు. కారు కొనే ముందు పార్కింగ్ స్థలం చూసుకోమని కొనమని చెప్తుంటారు. ఎక్కడికైనా బయటకు వెళ్తే పార్కింగ్ కోసం నానా పాట్లు పడాల్సిందే. ఇక రాజకీయ నాయకులు, సెలబ్రెటీల ఇళ్ల చుట్టుపక్కల అయితే పార్కింగ్ తిప్పలు మామూలుగా ఉండవు. వాళ్ల దగ్గరకు వచ్చేవాళ్లతో ఆ చుట్టపక్కల వాహనాలన్నీ నిండిపోతాయి. విజిటర్స్ పార్కింగ్ ఏమోగానీ.. అక్కడుంటున్నవారికే పార్కింగ్ స్థలం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడతారు.

అలా ఇబ్బందులు పడిన ఓ వ్యక్తి ఏకంగా సీఎం కాన్వాయ్ను అడ్డుకున్నాడు. ఈ ఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. సీఎం సిద్ధరామయ్య ఇంటికి ఎదురుగా నరోత్తమ్‌ అనే వృద్ధుడు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో తన ఇంటివద్ద సీఎం కాన్వాయ్ను అడ్డుకున్నాడు. మీ దగ్గరకు వచ్చే వారి వల్ల పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని నరోత్తమ్ సీఎం సిద్ధరామయ్యతో చెప్పాడు.

‘‘మీ దగ్గరకు వచ్చేవారు వాహనాలను ఇష్టం వచ్చినట్లు పార్క్ చేస్తున్నారు. దీంతో మాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మా వాహనాలను బయటకు తీయలేకపోతున్నాం. వాహనం బయటకు తీసి తిరిగి వచ్చేసరికి పార్కింగ్ స్థలం ఉండడం లేదు. గత ఐదేళ్లుగా ఈ ఇబ్బందులు పడుతున్నాం.. ఇకపై దీనిని మేం భరించలేం’’ అని నరోత్తమ్ సీఎంతో వాపోయాడు. దీంతో వారి పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.


Updated : 28 July 2023 3:36 PM IST
Tags:    
Next Story
Share it
Top