కునోలో మరణమృదంగం.. ఇప్పటికి తొమ్మిది..
X
మనదేశంలో అంతరించిన చీతాలను మళ్లీ వృద్ధి చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టు(Project Cheetah) విఫలమయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి తీసుకొచ్చిన 20 చీతాల్లో ఇప్పటికే ఎనిమిది చనిపోగా తాజాగా మరొకటి కూడా కన్నుమూసింది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని కునో జాతీయ పార్కు (Kuno National Park)లో ధాత్రి (Dhartri) అనే ఆడ చీతా బుధవారం చనిపోయింది. ఏ కారణాల వల్ల చనిపోయిందో తెలియడం లేదని, పోస్టు మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని పార్కు అధికారులు చెప్పారు.
ఇప్పటివరకు చనిపోయిన చీతాల్లో మూడు పిల్లలు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా గత ఏడాది సెప్టెంబర్‌లో వీటిని తీసుకొచ్చారు. కునోలో నాలుగు చీతాలు పుట్టాయి. చీతాలను ట్రాక్ చేసేందుకు వాటి మెడలకు రేడియో కాలర్లు వేయడం(Radio collars) వల్లే చనిపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ కాలర్లను తొలగించారు. ప్రస్తుతం కునోలో రు. ప్రస్తుతం ఆరు మగ, నాలుగు ఆడ చీతాలు ఎన్‌క్లోజర్లలో ఉంచి జాగ్రత్తగా గమనిస్తున్నారు. కొన్ని ఆనారోగ్యం వల్ల, కొన్ని వాతావరణానికి అలవాటుపడలేక ఇబ్బందిపడుతున్నాయి. వాటికి పూర్తిస్థాయి వైద్యపరీక్షలు నిర్వహించిన తర్వాత మళ్లీ అడవుల్లోకి వెదలిపెట్టనున్నారు.