Home > జాతీయం > మెట్రో రైలులో చితక్కొట్టుకున్నారు... వీడియో వైరల్

మెట్రో రైలులో చితక్కొట్టుకున్నారు... వీడియో వైరల్

మెట్రో రైలులో చితక్కొట్టుకున్నారు... వీడియో వైరల్
X

చిత్ర, విచిత్ర వేషాలకు ఢిల్లీ మెట్రో కేరాఫ్ అడ్రస్. యువతీ, యువకుల ముద్దు ముచ్చట్లలతో ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా దిల్లీ మెట్రో నుంచి మరో వీడియో బయటకొచ్చింది. ఈసారి రొమాన్స్ కాకుండా వైలెన్స్ వీడియో బయటకొచ్చింది. ఇద్దరు వ్యక్తులు రద్దీ రైలులో ఫైటింగ్‌కు దిగారు. నిలబడడం కోసం ముందుగా ఘర్షణ పడి..తర్వాత ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. తోటి ప్రయాణికులు అడ్డుకున్న ఏ మాత్రం వినకుండా తన్నుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ (DMRC) స్పందించింది. మెట్రోలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని తెలిపింది. ఎవరైనా అభ్యంతరకరంగా, అనుచితం ప్రవర్తిస్తే వెంటనే డీఎంఆర్‌సీ హెల్ప్‌లైన్‌కి తెలియజేయాలని వెల్లడించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఫ్లయింగ్‌ స్క్యాడ్‌లను కూడా నియమించినట్లు తెలిపింది





Updated : 29 Jun 2023 4:31 PM IST
Tags:    
Next Story
Share it
Top