Home > జాతీయం > గొర్రె పిల్ల కోసం గొడవ..పోలీస్ స్టేషన్‎కు పంచాయతీ..

గొర్రె పిల్ల కోసం గొడవ..పోలీస్ స్టేషన్‎కు పంచాయతీ..

గొర్రె పిల్ల కోసం గొడవ..పోలీస్ స్టేషన్‎కు పంచాయతీ..
X

ఓ గొర్రె పిల్ల కోసం ఇద్దరు యువకులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. మధ్యప్రదేశ్‌లోని రేవా పట్టణానికి చెందిన సంజయ్‌ ఖాన్ , షారుఖ్ ఖాన్ మధ్య గొర్రె కోసం గొడవపడ్డారు. ఆ గొర్రె నాదెంటే నాదని వాగ్వాదానికి దిగారు. చివరికి న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే పోలీసులకు కూడా వీరి పంచాయతీ

తలనొప్పిగా మారింది.




సంజయ్‌ ఖాన్‎కు చెందిన ఓ గొర్రె పిల్ల ఆరు నెలల క్రితం తప్పిపోయింది. ఇటీవల బక్రీద్ సమయంలో ఖారఖ్ ఖాన్ బలిచ్చేందుకు సిద్ధం చేసిన గొర్రెను చూసి..అది నాదే అంటు వాదనకు దిగాడు. అయితే రూ.15వేలు పెట్టి కొన్నానని, కాబట్టి ఆ గొర్రె నాదంటూ షారుఖ్‌ వాదించాడు. దీనిపై ఇద్దరూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. గొర్రె తమదేనని చెప్పడానికి సాక్ష్యాలు తీసుకురావాలని పోలీసులు సూచించారు. దీంతో వారు తమ వద్ద ఉన్న గొర్రె చిన్ననాటి ఫోటోలను తీసుకొచ్చి పోలీసులకు చూపెట్టారు. అయితే వారు తెచ్చి ఫోటోలు రెండూ ఒకేలా ఉండటంతో పోలీసులకు ఏం చేయాలో తోచలేదు. సమస్యలను పరిష్కరించలేమని స్థానిక నాయకులకు సమాచారమిచ్చారు. చివరికి గొర్రెను సంజయ్‌ ఖాన్‌కు అప్పగించారు. దానికి ఎలాంటి హానీ తలపెట్టొద్దని ఇరువురికి సూచించి పంపించారు. సంజయ్ వద్ద ‘తప్పిపోయిన గొర్రెను ఎవరో షారుఖ్‌కు విక్రయించి ఉంటారని ఓ పోలీస్ అధికారి తెలిపారు.

Updated : 1 July 2023 7:29 PM IST
Tags:    
Next Story
Share it
Top