Nirmala Sitharaman : ఆ రికార్డు బద్దలు కొట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
X
కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చేనెల ఫిబ్రవరి 1వ తేదిన ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2024లో లోక్‌సభ ఎన్నికలు రానున్న తరుణంలో ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం లేదు. దీంతో ఈసారి నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిసారీ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. అలా ఇప్పటి వరకూ వరుసగా ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లను, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు.
ఇప్పటి వరకూ ఆ రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరుపై ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును నిర్మలమ్మ బద్దలు కొట్టారు. ఫిబ్రవరి 1వ తేదిన సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడంతో ఆమె గతంలో ఆర్థిక మంత్రులుగా ఉన్న మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హాల రికార్డులను బ్రేక్ చేయనున్నారు. ఈ నేతలంతా ఐదుసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను సమర్పించినవారే. అందులో ఆర్థిక మంత్రిగా దేశాయ్ ఐదు వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.
నిర్మలమ్మ ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌లో ఈసారి పెద్దగా విధానపరమైన మార్పులేవీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే గత నెలలో జరిగిన ఓ కార్యక్రమంలోనే నిర్మలమ్మ దానిపై క్లారిటీ ఇచ్చేశారు. బడ్జెట్‌లో ఎటువంటి ముఖ్య ప్రకటనను చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ సార్వత్రికి ఎన్నికల తర్వాత జూన్ నెలలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. దీంతో కొత్త ప్రభుత్వం జూలై నెలలో 2024-25కు సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను తీసుకురానుంది.