Home > జాతీయం > Breaking News : తెలంగాణ ఎక్స్‎ప్రెస్‎లో మంటలు..పరుగులు తీసిన ప్రయాణికులు

Breaking News : తెలంగాణ ఎక్స్‎ప్రెస్‎లో మంటలు..పరుగులు తీసిన ప్రయాణికులు

Breaking News : తెలంగాణ ఎక్స్‎ప్రెస్‎లో మంటలు..పరుగులు తీసిన ప్రయాణికులు
X

ఒకే రోజు రెండు రైళ్లలో అగ్నిప్రమాదాలు జరిగాయి. నాగ్‌పుర్‌లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగగా..అటు బెంగళూరులో ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌‎లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ముందుగానే సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. ఈ రెండు ప్రమాదాల్లో ప్రయాణికులకు ఎలాంటి హాని జరగలేదు. ప్రస్తుతం రెండు రైళ్లల్లో ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదాలకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మహారాష్ట్రలో ప్రయాణిస్తున్న తెలంగాణ ఎక్స్‎ప్రెస్‎లో శనివారం ఉదయం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సిబ్బంది ఆదిలోనే ఈ ప్రమాదాన్ని గుర్తించడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పినట్లైంది. ముందుగా రైలులోని ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అలర్ట్ అయిన రైల్వే సిబ్బంది రైలును నాగ్‌పుర్‌ సమీపంలో ఆపారు. ప్రయాణికులు బోగి నుంచి కిందికి దించారు. దీంతో ఒక్కసారిగా భయాందోళకు గురైన ప్రయాణికులు పరుగులు పెట్టారు. ఇదిలా ఉండగా ప్రమాదం గురించిన సమాచారం అందడంతో ఘటనాస్థలానికి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు.

ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లోనూ మంటలు :

అటు బెంగళూరులోనూ కేఎస్‌ఆర్‌ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లోనూ ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లో రెండు భోగీలకు మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగ అలుముకుంది. అయితే ప్రయాణికులు ఎవరూ రైలులో లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లైంది. రైలు కేఎస్ఆర్ స్టేషన్‎లో ఆగిన రెండు గంటలకు ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి హానీ జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.



Updated : 19 Aug 2023 5:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top