Home > జాతీయం > తొలిసారి చంద్రుడి ఫోటోలు తీసిన చంద్రయాన్ 3

తొలిసారి చంద్రుడి ఫోటోలు తీసిన చంద్రయాన్ 3

Thumb: చంద్రుడి ఫోటోలు వచ్చాయ్

తొలిసారి చంద్రుడి ఫోటోలు తీసిన చంద్రయాన్ 3
X


ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 3 ప్రయోగం సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. చంద్రుడిపై కాలుమోపడమే లక్ష్యంగా రోదసిలో పయనిస్తున్న భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 అనుకున్న లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది.ఇప్పటికే చంద్రుడికి అతి చేరువలోకి వెళ్లిన స్పేస్‌ క్రాఫ్ట్‌ తాజాగా ఒక వీడియోను రికార్డు చేసి పంపింది. చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ఈ వీడియోను ఇస్రో విడుదల చేసింది. ఈ చిత్రాల్లో చందమామ చాలా దగ్గరగా కనిపిస్తుండటం విశేషం. చందమామపై లోయలు, పర్వతాలు, గ్రహశకలాల దాడుల దృశ్యాలను ఈ చిత్రాల్లో చూడొచ్చు. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ ప్రవేశించినప్పుడు చందమామ ఇలా కనిపిస్తోందంటూ ట్విట్టర్‌లో వీడియో షేర్‌ చేసింది ఇస్రో.

జాబిలికి చేరువైన చంద్రయాన్‌ 3 వ్యోమనౌక.. తొలిసారి చంద్రుడి ఉపరితలాన్ని తన కెమెరాలో బంధించింది. ఆ ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. శనివారం లునార్‌ ఆర్బిట్‌ ఇన్సర్షన్‌ ప్రక్రియ సమయంలో ఈ ఫొటోలను చంద్రయాన్‌ తీసినట్లు ఇస్రో పేర్కొంది. జాబిలి కక్ష్యలో ప్రవేశించిన వెంటనే తాను చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని అనుభవిస్తున్నానని.. చంద్రయాన్‌ 3.. ఇస్రోకు తొలిసారి సందేశం పంపిందని వివరించింది.

ఇస్రో జులై 14న ఎం-4 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌-3 ప్రయోగం ప్రారంభించిన విషయం విధితమే. ఆ తర్వాత మూడు వారాల్లో ఐదుసార్లు కక్ష్యను పెంచుతూ భూమికి దూరంగా వ్యోమనౌకను తీసుకెళ్లారు. ఆగస్టు 1న ట్రాన్స్‌లూనార్‌ ఇంజెక్షన్‌ అనే కీలక విన్యాసంతో చంద్రుడిని చేరే లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలోకి వ్యోమనౌకను ప్రవేశ పెట్టారు. అనంతరం శనివారం రాత్రి 7 గంటల సమయంలో జాబిల్లికి చేరువగా ఉండే బిందువులోకి ప్రవేశించింది. లూనర్ ఆర్బిట్ ఇనసర్షన్ పక్రియను విజయవంతంగా చేపట్టామని, చంద్రయాన్‌-3 మొదటిదశ కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఆగస్టు 6 వ తేదీ 11గంటలకు నిర్వహించారు. ఇలా కక్ష్యను తగ్గిస్తూ ఈ నెల 17 తర్వాత వ్యోమనౌకను చంద్రుడికి చేరువ చేస్తారు. అనంతరం వ్యోమనౌకను చంద్రుడికి 100 కి.మీల ఎత్తులోకి తీసుకెళ్తారు. తదనంతరం ఈ నెల 23న సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండర్ ను ల్యాండ్ చేస్తారు.


Updated : 7 Aug 2023 8:41 AM IST
Tags:    
Next Story
Share it
Top