Home > జాతీయం > నాకే ఎక్కువ శిక్ష పడింది.. అస్సలు ఊహించలేదు : రాహుల్ గాంధీ

నాకే ఎక్కువ శిక్ష పడింది.. అస్సలు ఊహించలేదు : రాహుల్ గాంధీ

నాకే ఎక్కువ శిక్ష పడింది.. అస్సలు ఊహించలేదు : రాహుల్ గాంధీ
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరువు నష్టం కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పరువునష్టం కేసులో బహుశా ఎక్కువ శిక్ష తనకే విధించారని అన్నారు. తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తారని అస్సలు ఊహించలేదని చెప్పారు. 2004లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇటువంటివి జరుగుతాయని అనుకోలేదన్నారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

తనపై అనర్హత వేటు పడటం కూడా ఒకందుకు మంచిదేనని రాహుల్ అభిప్రాయపడ్డారు. భారత్‌ జోడో యాత్రను ఉద్దేశిస్తూ.. పార్లమెంట్‌లో కూర్చోవడం కంటే పెద్ద అవకాశం లభించిందని చెప్పారు. ప్రస్తుతం భారత్లో ప్రతిపక్షాలు ఘర్షణ పడుతున్నాయని.. వ్యవస్థలను బీజేపీ కబ్జా చేసిందని ఆరోపించారు. వ్యవస్థలు తమకు సహాయపడటం లేదని గుర్తించిన తర్వాత తాము రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నామని తెలిపారు.

తాము బీజేపీతో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నామని రాహుల్ చెప్పారు. స్వదేశంలో పరిస్థితులను చక్కదిద్దడానికి విదేశీ సాయం కోరుతున్నారా? అని అడిగినపుడు.. తాను ఎవరి సహకారాన్ని కోరడం లేదని రాహేల్ చెప్పారు. మన పోరాటం మనదేననే స్పష్టత తనకు ఉందన్నారు. అయితే భారత దేశం నుంచి వచ్చిన యువ విద్యార్థులు అమెరికాలో ఉన్నారని, వారికి ఈ వివరాలను చెప్పాలను తాను అనుకుంటున్నట్లు వివరించారు. ప్రధాని మోడీ కూడా ప్రజలతో మాట్లాడాలని కఠిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

పరువు నష్టం కేసు


కర్ణాటకలో 2019లో జరిగిన ఓ బహిరంగ సభలో దొంగలందరి ఇంటీ పేరు మోడీ అనే ఉంటుందని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం రద్దు చేసింది.

Updated : 1 Jun 2023 12:07 PM GMT
Tags:    
Next Story
Share it
Top