Home > జాతీయం > భారత్​ తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ: బీజేపీ నేత

భారత్​ తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ: బీజేపీ నేత

భారత్​ తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ: బీజేపీ నేత
X

భారత తొలి ప్రధాని ఎవరని అడిగితే టక్కున చెప్పే పేరు జవహార్ లాల్ నెహ్రూ. కానీ, కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ మాత్రం మొదటి ప్రధాని నెహ్రూ కాందంటున్నారు. ఇటీవల కర్నాటకలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. భారత మొదటి ప్రధాని నేహ్రూ కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘నిరాహార దీక్షల వల్ల మనకు స్వాతంత్ర్యం రాలేదు’ అని అంబేద్కర్ ఓ పుస్తకంలో అన్నారు. ఆ వ్యాఖ్యలను గుర్తు చేసిన బసనగౌడ.. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపింస్తూ, శాంతి పోరాటం అంటే ఎప్పటికీ మనకు స్వాతంత్ర్యం వచ్చేది కాదు. నేతాజీ.. బ్రిటిషర్లకు చూపించిన భయం వల్లే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని బసనగౌడ చెప్పుకొచ్చారు.





‘బ్రిటిషర్లు దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించినప్పుడే బోస్ దేశ తొలి ప్రధానిగా ఉన్నారు. అప్పటికే దేశానికి సొంత కరెన్సీ, జెండా, జాతీయ గీతం ఉన్నాయి. ఇవే భారత్ కు మొదటి ప్రధాని నెహ్రూ కాదు అనడానికి కారణం’ అని బసనగౌడ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీ కావాలని, ప్రజలను రాజకీయ ప్రలోభాలకు గురిచేయాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బసన గౌడ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు.







Updated : 29 Sep 2023 5:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top