Home > జాతీయం > రాజస్థాన్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

రాజస్థాన్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

రాజస్థాన్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
X

రాజస్థాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఆల్బర్ట్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్‌ నేత వసుంధర రాజే తదితరులు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. డిసెంబర్ 3న వెలువడిన ఫలితాల్లో రాజస్థాన్‌లో బీజేపీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటు చేసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్‌లాల్‌ శర్మను బీజేపీ హైకమాండ్ సీఎంగా ఎంపిక చేసింది. దియా సింగ్‌ కుమారి, ప్రేమ్‌ చంద్‌ బైర్వాలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాల్లో విరోధులైన అశోక్ గెహ్లాట్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లు పక్కపక్కనే కూర్చుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సంజీవని కుంభకోణం కేసులో హస్తం ఉందంటూ గజేంద్ర సింగ్ పై గెహ్లోట్ పలుమార్లు ఆరోపణలు చేశారు. దీంతో షెకావత్ ఆయనపై ఢిల్లీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలోనే కొత్త సీఎం ప్రమాణ స్వీకార సమయంలో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Updated : 15 Dec 2023 1:43 PM IST
Tags:    
Next Story
Share it
Top