Home > జాతీయం > Uttarkashi Tunnel Rescue : సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలకు వేడివేడి కిచిడీ

Uttarkashi Tunnel Rescue : సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలకు వేడివేడి కిచిడీ

Uttarkashi Tunnel Rescue : సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలకు వేడివేడి కిచిడీ
X

ఉత్తరాఖండ్​లో సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు సేఫ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. 10 రోజులుగా చీకట్లోనే బతుకు జీవుడా అంటూ బిక్కుబిక్కుగా గడుపుతున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. పగలురాత్రి తేడా లేకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. పక్కా ప్రణాళికలతో చేపడుతున్న సహాయక చర్యల్లో భారీ విజయం సాధించారు. లోపల కార్మికులను ప్రత్యక్షంగా చూశారు.

ఆరు అంగుళాల వ్యాసం ఉన్న గొట్టాన్ని.. సొరంగ శిథిలాల ద్వారా పంపించగలిగారు. దాని ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు. లోపల ఉన్న కార్మికులను ప్రత్యక్షంగా చూశారు. సొరంగం కూలిన ఘటన తర్వాత నాలుగు అంగుళాల గొట్టపు మార్గం ద్వారా కేవలం డ్రైఫ్రూట్సే పంపిన అధికారులు.. తొలిసారి వేడివేడి ఆహారాన్ని కూలీలకు అందించారు. వెడల్పు అయిన వాటర్ బాటిళ్లలో కిచిడీని నింపి.. ఆరు అంగుళూల వ్యాసం పైపు ద్వారా అధికారులు పంపారు. సొరంగంలో ఉన్న కూలీల ఒక్కొక్కరికి 750 గ్రాముల చొప్పున ఆహారాన్ని సిద్ధం చేస్తున్నామని అక్కడి వారు​ తెలిపారు. ముందు కిచిడీ పంపామని, తర్వాత నారింజ, యాపిల్స్​ పంపుతామని చెప్పారు. నిమ్మరసాన్ని కూడా పంపనున్నట్లు వెల్లడించారు.

41 మంది కూలీల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. వైద్యుల సహకారంతో రెస్క్యూ అధికారులు.. జాబితాను సిద్ధం చేశారు. తక్షణ బలాన్నిచ్చే అరటిపండ్లు, యాపిల్స్​, డలియా వంటి పంపుతున్నారు.సొరంగంలో కూలీలు ఉన్నచోట దృశ్యాలను.. ఆరు అంగుళాల పైపు ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా అధికారులు చూశారు. అందుకు కోసం ఎండోస్కోపీ తరహా ఓ కెమెరాను ఉపయోగించారు. ఆ దృశ్యాలను అధికారులు షేర్ చేశారు. కూలీలతో అధికారులు మాట్లాడేందుకు ఒక వాకీ- టాకీని పంపారు. దాంతో పాటు రెండు ఛార్జర్​లు కూడా పంపారు. దాని ద్వారా అధికారులు.. కూలీలతో మాట్లాడుతున్నారు. శిథిలాలకు రెండోవైపు వరకు 53 మీటర్ల లోతున పైపును పంపించడం వల్ల కూలీలు తాము చెప్పినదానిని వినగలుగుతున్నారని అధికారులు తెలిపారు.













Updated : 21 Nov 2023 9:25 AM IST
Tags:    
Next Story
Share it
Top