Home > జాతీయం > అమర్‌నాథ్‌ యాత్ర..గుండెపోటుతో ఐదుగురు యాత్రికుల మృతి

అమర్‌నాథ్‌ యాత్ర..గుండెపోటుతో ఐదుగురు యాత్రికుల మృతి

అమర్‌నాథ్‌ యాత్ర..గుండెపోటుతో ఐదుగురు యాత్రికుల మృతి
X

అమర్‌నాథ్‌ యాత్రలో విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అక్కడి అసాధారణ పరిస్థితులు కారణంగా ప్రాణాలు పోతున్నాయి. అధిక ఎత్తులో ఆక్సిజన్‌ గాఢత తక్కువగా ఉండటం వల్ల పలువురు ఇబ్బందులకు గురవుతున్నారు. జులై 1 నుంచి యాత్ర మొదలవ్వగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఐదుగురు చనిపోయారు. అనంతనాగ్‌ జిల్లాలోని పెహల్గాం మార్గంలో ముగ్గురు.. గాందర్‌బల్‌ జిల్లా బల్తాల్‌ మార్గంలో మరో ఇద్దరు మరణించారు. వీరంతా గుండెపోటుతో మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు, మధ్యప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు ఉండగా.. ఇంకో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

భారీ వర్షాలు కారణంగా మూడు రోజుల అనంతరం అమర్‌నాథ్ యాత్ర మంగళవారం ప్రారంభమైంది. జూలై 11 వరకు అమర్‌నాథ్‌ క్షేత్రాన్ని 1,37,353మంది యాత్రికులు సందర్శించారు. అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర జులై 1 నుంచి మొదలై ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. 62 రోజుల పాటు జరిగే ఈ అమర్‌నాథ్‌ యాత్రలో భాగంగా హిమాలయ కొండల్లో నెలవైన మంచు శివలింగాన్ని దర్శించుకోవడం కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున యాత్రికులు తరలి వస్తుంటారు. దక్షిణ కశ్మీర్‌ హిమాలయాల్లో 3,888 మీటర్ల ఎత్తులో ఉండే మంచు శివలింగాన్ని దర్శించుకుంటారు


Updated : 12 July 2023 6:24 PM IST
Tags:    
Next Story
Share it
Top