Home > జాతీయం > కాశ్మీర్లో చొరబాటు యత్నం.. ఐదుగురు ఉగ్రవాదుల హతం..

కాశ్మీర్లో చొరబాటు యత్నం.. ఐదుగురు ఉగ్రవాదుల హతం..

కాశ్మీర్లో చొరబాటు యత్నం.. ఐదుగురు ఉగ్రవాదుల హతం..
X

దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో మచిల్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు కొందరు టెర్రరిస్టులు ప్రయత్నించారు. ఈ కుట్రను తెలుసుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది జాయింట్ ఆపరేషన్ నిర్వహించి దాన్ని భగ్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. వీరంతా లష్కరే తోయిబాకు చెందిన వారని జమ్మూకశ్మీర్‌ అదనపు డీజీ విజయ్‌ కుమార్‌ చెప్పారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని అన్నారు.

నియంత్రణ రేఖ వద్ద ఇంకా 16 టెర్రరిస్ట్ లాంచింగ్ ప్యాడ్స్ పనిచేస్తున్నాయని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. వాటి సాయంతో పాకిస్థాన్ నుంచి టెర్రరిస్టులను భారత్ లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చొరబాట్లను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.


Updated : 26 Oct 2023 7:42 PM IST
Tags:    
Next Story
Share it
Top