India Maldives row: లక్షద్వీప్కు ఫుల్ డిమాండ్.. మూడు నెలల వరకు నో ఎంట్రీ
X
మీరు చదివింది నిజమే. అయితే హెడ్డింగ్ చూసి ఇంకోలా అనుకుంటే పొరపాటే. మాల్దీవ్స్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా.. అక్కడ టూర్లకు వెళ్లే భారతీయులు తమ హోటల్, ట్రావెల్ టికెట్లను క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే. మాల్దీవ్స్ ను బాయ్ కాట్ చేసి, లక్షద్వీవులకు వెళ్లాలని భారతీయులు నిర్ణయించుకున్నారు. దీంతో లక్షద్వీప్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పర్యాటక ప్రేమికులంతా.. అక్కడికెళ్లేందుకే మొగ్గుచూపుతున్నారు. దీంతో లక్షద్వీప్ కు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో లక్షద్వీప్ కు అలయన్స్ ఎయిర్ విమాన సంస్థ ప్రయాణాలను ప్రారంభించిన ఏకైక విమానయాన సంస్థగా నలిచింది. దీంతో కొచ్చి అగట్టి కొచ్చికి ఎక్స్ ట్రా విమానాలను మొదలుపెట్టింది. వారానికి రెండు రోజులు.. అంటే ఆది, బుధవారాల్లో అదనపు విమానాలను నడుపుతున్నట్లు తెలిపింది.
లక్షద్వీప్‌లో ఓ ప్రాంతీయ ఎయిర్ పోర్ట్ ఉంది. లక్షద్వీప్‌లో కొచ్చి, కేరళలోని అగట్టి ద్వీపం మధ్య విమానం నడుస్తుంది. ఈ మార్గంలో నడుస్తున్న ఏకైక విమానయాన సంస్థ ఇదే. ఈ విమానం 70 మంది సామర్థ్యం గలది. ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో నడుస్తుంది. కాగా ఈ ఎయిర్ లైన్స్ లో మార్చి వరకు అన్ని టికెట్లు అమ్ముడుపోయాయని ఓ అధికారి తెలిపారు. మూడు నెలలు టికెట్లు ఫుల్ అవడంతో.. పర్యాటకులంతా సోషల్ మీడియాలో తమను ప్రశ్నిస్తున్నారు వారు తెలిపారు. విపరీతమైన డిమాండ్ ఉన్న కారణంగా అదనపు విమానాలు నడపాలని కోరుతున్నారు. దీంతో ప్రయాణికులకోసం మరిన్ని విమానాలను తీసుకొచ్చే ఆలోచనలో అలయన్స్ ఎయిర్ ఉంది.