Home > జాతీయం > America : గాల్లో ఉండగా ఊడిన విమానం టైరు...వీడియో వైరల్

America : గాల్లో ఉండగా ఊడిన విమానం టైరు...వీడియో వైరల్

America : గాల్లో ఉండగా ఊడిన విమానం టైరు...వీడియో వైరల్
X

అమెరికాలోని యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం టేక్ ఆఫ్ చేస్తుండగా గాల్లో దాని టైరు ఊడిపడింది. దీంతో అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. లాస్‌ఏంజల్స్ ఇంటర్నెషనల్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూనైటెడ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్ బీ777-200 విమానం జపాన్ వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ల్యాండింగ్ గేర్‌లో ఉన్న టైర్లలో ఒకటి ఊడి కిందపడిపోయింది. అది కాస్తా ఎయిర్ పోర్ట్ లోని పార్కింగ్ లాట్ లో పడిపోవడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కాగా ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

అయితే టైరు ఊడినట్లు గుర్తించిన పైలెట్లు వెంటనే ఫ్లైయిట్ ని లాస్ ఏంజిల్స్ లో ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు. అందులోని ప్రయాణికులను మరో విమానంలో పంపిచామని ఎయిర్ పోర్ట్ వర్గాలు తెలిపాయి. ఘటన సమయంలో విమానంలో 249 మంది ప్రయాణికులు ఉన్నారు.





Updated : 8 March 2024 1:29 PM IST
Tags:    
Next Story
Share it
Top