Home > జాతీయం > హిమాచల్ ప్రదేశ్ లో పొంగిపోర్లుతున్న నదులు

హిమాచల్ ప్రదేశ్ లో పొంగిపోర్లుతున్న నదులు

హిమాచల్ ప్రదేశ్ లో పొంగిపోర్లుతున్న నదులు
X

హిమాచల్ ప్రదేశ్ ను వర్షాలు, వరదలు మళ్ళీ ముంచెత్తుతున్నాయి. ఆదివారం నుంచి కురుస్తున్న వానలధాటికి అక్కడి గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. ఆస్తి నష్టంతో పాటూ, ప్రాణ నష్టం కూడా వాటిల్లుతోంది.

హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో సంబల్ గ్రామంలో పొంగుతున్న నీటి ప్రవాహంలో పడి 7 ప్థానికులు కొట్టుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ షేర్ చేశారు. జలప్రళయాన్ని తలపిస్తున్న దీని చూస్తుంటే వెన్నులోంచి వణుకు పుడుతోంది. వరదల్లో సంబల్ గ్రామంలో చాలా భాగం కొట్టుకుపోయింది. అలాగే జతోగ్ సమ్మర్ హిల్స్ రైల్వే స్టేషన్ లోని రైల్వే ట్రాక్ లు కూడా కొట్టుకుపోయాయి. సీఎం పోస్ట్ చేసిన వీడియోలో రైల్వే ట్రాక్ గాల్లో వేలాడుతూ కనిపించింది.

అలాగే సిమ్లాలోని ఓ ఆలయం మీద కూడా కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మరణించారు. శిధిలాల కింద మరో 30 మంది చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. ఇంకా రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది భీకర వర్షాలు హిమాచల్ ప్రదేశ్ ను అతలాకుతలం చేశాయి. వర్షాలు, కొండచరియలవల్ల 7, 020.28 కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తంగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు చార్ ధామ్ యాత్రను నిలిపేశారు. మరో రెండు వారాలపాటూ యాత్రికులను అనుమతించమని అధికారులు ప్రకటించారు.

Updated : 14 Aug 2023 5:31 PM IST
Tags:    
Next Story
Share it
Top