Home > జాతీయం > మినిమమ్ బ్యాలెన్స్ లేదని కట్ చేసిన ఛార్జీలు రూ.21వేల కోట్లు

మినిమమ్ బ్యాలెన్స్ లేదని కట్ చేసిన ఛార్జీలు రూ.21వేల కోట్లు

మినిమమ్ బ్యాలెన్స్ లేదని కట్ చేసిన ఛార్జీలు రూ.21వేల కోట్లు
X

ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, ప్రైవేట్ బ్యాంకులు తమ ఖాతాదారుల నుంచి కొంత మేర నగదును వసూలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేదని, ఏటీఎం ఛార్జీలు, ఎస్సెమ్మెస్ ఛార్జీలు రూపంలో కొంత మేర ఛార్జీలు విధిస్తాయి. ఇలా వసూలు చేసిన నగదు వివరాలను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపింది. 2018 నుంచి ఇప్పటి వరకు రూ.35 వేల కోట్లకు ఛార్జీల రూపంలో వసూలు చేసినట్లు వెల్లడించింది. వాటిలో కనీస బ్యాలెన్స్‌ ఉంచని కారణంగా రూ.21,000 కోట్లు, ఏటీఎం లావాదేవీల కోసం రూ.8,000 కోట్లు, ఎస్సెమ్మెస్ సేవలు అందిస్తున్నందుకు రూ.6,000 కోట్లు సేకరించినట్లు పేర్కొంది.

కొన్ని రకాల ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ ఉంచకపోతే వాటిపై బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. అయితే, ఈ ఛార్జీలు ప్రాంతాల వారీగా మారుతుంటాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. మెట్రోసిటీలలో

అకౌంట్ మినిమమ్ బ్యాలెన్స్ రూ.3,000 నుండి రూ.10,000 వరకు, పట్టణ ప్రాంతాల్లో రూ.2,000 నుండి రూ.5,000 వరకు మరియు గ్రామీణ ప్రాంతాల్లో రూ.500 నుండి 1,000 వరకు ఉంటుంది. దీన్ని ఉల్లంఘిస్తే రూ.400 నుండి 500 వరకు ఛార్జీలు విధించవచ్చు. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు అకౌంట్ మినిమమ్ బ్యాలెన్స్ నాన్-కాంప్లయన్స్ ఛార్జీలతో పాటుగా ఒక్కో లావాదేవీకి సాధారణంగా రూ.100 నుండి 125 వరకు నగదు లావాదేవీ రుసుములను కూడా విధిస్తాయి.

ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన ఖాతాలు మరియు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఈ ఖాతాలకు ఒకే నెలలో చేసే డిపాజిట్ల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు. అయితే ఏటీఎమ్ లలో నెలకు నాలుగు కంటే ఎక్కువ సార్లు నగదును విత్ డ్రా చేస్తే ఛార్జీలు పడతాయి.

Updated : 10 Aug 2023 10:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top