Pakistan Elections : తొలిసారి పాక్ ప్రధానిగా స్వతంత్ర అభ్యర్థి?
X
పాకిస్థాన్ ఎన్నికల్లో ఓటర్లు హంగ్ తీర్పు నిచ్చారు. పాక్ లో రెండు రోజులుగా ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్లారు. ఇండిపెండెంట్లుగా నిలబడ్డప్పటికీ ఆ పార్టీ వాళ్లు ముందంజలో ఉండటంతో రాజకీయ ప్రావీణ్యులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాక్ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ ను దాటలేకపోయింది. మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లకు దూరంలో పార్టీలు ఆగిపోయాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతు తెలిపిన ఇండిపెండెంట్లు సత్తా చాటారు.
92 మంది ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల విజయం సాధించారు. కాగా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ 63 స్థానాలు దక్కించుకుంది. బిలావర్ భుట్టో జర్దారీకి చెందిన పాక్ పీపుల్స్ పార్టీకి 50 స్థానాలు దక్కాయి. ఇంకా కొన్ని సీట్ల ఫలితాలు రావాల్సి ఉంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల సంఖ్య అధికంగా ఉండటంతో పాకిస్తాన్‌లో తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థుల ప్రభుత్వం ఏర్పడనుండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెజారిటీ మార్కును తాకకపోవడంతో పాకిస్తాన్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు నవాజ్ షరీఫ్ ప్రకటించారు. కాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పీటీఐ మద్దతు కలిగిన అభ్యర్థులు మెజారిటీతో గెలిస్తే, వారు తమ సొంత గ్రూపు ద్వారా కొత్త ప్రభుత్వాన్న ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే ఎన్నికల ఫలితాలపై ఏఐ ద్వారా ప్రసంగించారు ఇమ్రాన్ ఖాన్. తమ పార్టీపై నమ్మకంతో ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఓటర్ల వల్ల లండన్ ప్లాన్ విఫలమైందని తెలిపారు. మీ ఓటు శక్తిని ప్రతిఒక్కరూ చూశారని ప్రజలకు తెలిపారు. కాగా ఇప్పుడు పోలింగ్ ఫలితాన్ని కాపాడుకొవాల్సిన అవసరం ఉందన్నారు. భారీగా నమోదైన పోలింగ్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపర్చిందని చెప్పుకొచ్చారు. ఆయన పార్టీ 30 సీట్లలో వెనకబడి ఉన్నప్పటికీ విక్టరీ ప్రసంగం చేసిన తెలివితక్కువ నాయకుడు షరీఫ్ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.