Home > జాతీయం > G 20 సదస్సుకు రాలేను.. ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్

G 20 సదస్సుకు రాలేను.. ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్

G 20 సదస్సుకు రాలేను.. ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్
X

సెప్టెంబరు 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే జీ 20 సదస్సుకు తాను హాజరుకాలేదనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రధాని మోడీకి చెప్పారు. రష్యా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్ ను పంపనున్నట్లు స్పష్టం చేశారు. ఈమేరకు ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్ చేసినట్లు పీఎంఓ వర్గాలు ప్రకటించాయి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ 20 సమావేశానికి రష్యా మద్దతు తెలిపినందుకు పుతిన్ కు మోడీ ధన్యవాదాలు చెప్పారు. ఇదిలా ఉంటే ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించినట్లు పీఎంఓ చెప్పింది.





జీ 20 సదస్సుకు పుతిన్‌ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశాలున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన రష్యా పుతిన్ ప్రత్యక్షంగా పాల్గొనరని స్పష్టం చేసింది. అయితే ఆయన వర్చువల్ గా సదస్సులో పాల్గొంటారా లేదా అన్నదానిపే త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఈ క్రమంలో పుతిన్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తాను ప్రత్యక్షంగా గానీ, వర్చువల్ గాగానీ హాజరుకానని స్పష్టం చేశారు.

దక్షిణాఫ్రికాలో జొహన్నెస్‌బర్గ్‌లో ఇటీవల బ్రిక్స్‌ సదస్సుకు కూడా పుతిన్‌ డుమ్మా కొట్టారు. ఆయన తరఫున అప్పుడు కూడా సెర్గీ లవ్రోవ్‌ పాల్గొన్నారు. ఈ ఏడాది మార్చిలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు పుతిన్‌పై అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. దీంతో ఆయన విదేశాలకు వెళితే అరెస్టు చేసే అవకాశముండటంతో జీ 20 సదస్సుకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.




Updated : 28 Aug 2023 5:12 PM GMT
Tags:    
Next Story
Share it
Top