Home > జాతీయం > మధురై అగ్నిప్రమాదం.. రైలు కోచ్లో నోట్ల కట్టలు

మధురై అగ్నిప్రమాదం.. రైలు కోచ్లో నోట్ల కట్టలు

మధురై అగ్నిప్రమాదం.. రైలు కోచ్లో నోట్ల కట్టలు
X

తమిళనాడులోని మధురైలో ఈ నెల 26న ఘోర రైలు ప్రమాదం జరిగింది. మధురైలోని స్టేషన్‎లో హాల్ట్ అయిన రైలులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9మంది మరణించారు. ఇక ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫోరెన్సిక్ నిపుణులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఒక పెట్టెలో రూ. 500, రూ. 200 నోట్ల కట్టలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డబ్బు ఎవరిదనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ డబ్బు ట్రావెల్ ఏజెన్సీకి చెందినదిగా అధికారులు అనుమానిస్తున్నారు. యాత్రికుల ఖర్చు కోసం ట్రావెల్ ఏజెన్సీ సిబ్బంది ఈ డబ్బును తమ వెంట తెచ్చుకున్నట్లుగా భావిస్తున్నారు. మరో వైపు ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు మిస్ అయ్యారు. ఈ క్రమంలో వారి కోసం స్పెషల్ టీంలతో గాలింపు చేపట్టారు. ప్రస్తుతం వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వారికి ఈ ప్రమాదంతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మదురై రైల్వే స్టేషన్‌కు సమీపంలో హాల్ట్ అయ్యింది. ఈ క్రమంలో ట్రైన్‎లోని ఓ ప్రైవేటు పార్టీ కోచ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కొంత మంది భక్తులు గ్యాస్ సిలిండర్‎ను ఉపయోగించి రైలులో వంట చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాధమిక విచారణలో తేలింది. సిలిండర్ పేలడంతో ఒక కంపార్ట్‌మెంట్‌ నుంచి మరో కంపార్ట్‌మెంట్‌కు వేగంగా మంటలు వ్యాపించాయి.



Updated : 28 Aug 2023 5:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top