Home > జాతీయం > SC Classification: ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం

SC Classification: ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం

SC Classification: ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం
X

ఎస్సీల(Scheduled Castes communities) వర్గీకరణ విషయంలో కేంద్రం ముందడుగు వేసింది.ఎస్సీ వర్గీకరణకు క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోం, న్యాయ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమించినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో..పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభ వేదికగా ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. దీనిపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న కమిటీ తొలిసారి భేటీ కానున్నట్లు సమాచారం. ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మోడీ సర్కార్ జీవో విడుదల చేసింది.




Updated : 19 Jan 2024 11:54 AM IST
Tags:    
Next Story
Share it
Top