నిత్యానంద దేశం ‘కైలాస’ ప్రధానిగా నటి రంజిత..?
X
అత్యాచార ఆరోపణలతో వివాదాస్పదమై.. దేశం నుంచి పారిపోయిన స్వామి నిత్యానంద.. తనకంటూ ప్రత్యేకంగా ఓ దేశాన్ని సృష్టించుకున్నాడు. దానికి యునైటెట్ స్టేట్స్ ఆఫ్ కైలాస (కైలాస దేశ) అని పేరు పెట్టుకున్నాడు. తన ప్రియ శిష్యురాలైన మాజీ నటి రంజితను ఆ దేశ ప్రధానిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఓ తమిళ న్యూస్ పేపర్ వెల్లడించింది. ఈ మేరకు నిత్యానంద.. తన వెబ్ సైట్ లోనూ ప్రకటించాడు.
రంజిత ఫొటో అప్ లోడ్ చేసి.. దాని కింద ఆమెను ‘నిత్యానందమయ స్వామి’ అని పేర్కొన్నాడు. అంతేకాకుండా హిందువుల కోసం ఏర్పాటైన ఆ దేశ ప్రధానిగా రంజితను నియమిస్తున్నట్లు పేర్కొన్నాడు. పలు తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించిన రంజిత.. అప్పటి తరానికి సుపరిచితం. ఇటీవల కౌలాస దేశం తరుపున ఐక్యరాజ్య సమితి సమావేశంలో మహిళా రాయబారులు పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే, తర్వాత జరుగబోయే సమావేశాలకు రంజిత ప్రధానిగా పాల్గొన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.