మగాడిగా మారుతున్న మాజీ సీఎం కూతురు.. కారణమిదే..?
X
ఆమె మాజీ సీఎం కూతురు.. తనలో ఆడపిల్ల కంటే మగాడి లక్షణాలే ఎక్కువ ఉన్నాయని చిన్నప్పుడే ఆమె గ్రహించింది. దీంతో పైకి ఆడపిల్లలాగ కనిపించినా.. మానసికంగా మగాడిలాగే వ్యవహరించేది. ఇప్పుడు శారీరకంగానూ మగాడిలా మారాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా తనే చెప్పింది.
పశ్చిమబెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కూతురు సుచేతన భట్టాచార్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను మగాడిలా మారుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు లింగమార్పిడి చికిత్స చేయించుంటానని ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన ఎల్జీబీటీక్యూ వర్క్షాప్కు హాజరైన తర్వాత ఈ విషయంపై తనకు పూర్తి అవగాహన వచ్చినట్లు ఆమె వివరించారు. ఇదే విషయంపై న్యాయ నిపుణులు, వైద్యుల సలహాలు తీసుకున్నట్లు చెప్పారు
‘‘ఇప్పుడు నా వయసు 41 ఏళ్లు. నా జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు నేను తీసుకోగలను. మానసికంగా నన్ను నేను మగాడిగా భావిస్తున్నా. ఇప్పుడు భౌతికంగానూ మగాడిగా మారాలనుకుంటున్నాను. ఈ నిర్ణయం వల్ల నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్య లేదు. దయచేసి నా తల్లిదండ్రులను ఇందులోకి లాగొద్దు’’ అని సుచేతన స్పష్టం చేశారు. చికిత్స తర్వాత తను పేరును సుచేతన నుంచి సుచేతన్ గా మార్చుకుంటానని చెప్పారు.