Home > జాతీయం > స్టేజిపై కన్నీళ్లు పెట్టుకున్న మాజీ సీఎం భార్య

స్టేజిపై కన్నీళ్లు పెట్టుకున్న మాజీ సీఎం భార్య

స్టేజిపై కన్నీళ్లు పెట్టుకున్న మాజీ సీఎం భార్య
X

ఝ‌ర్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ కన్నీటి పర్యమంతమయ్యారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన భర్తను గుర్తుచేసుకున్న ఆమె జేఎంఎం పార్టీ బహిరంగ సభలో మాట్లాడుతూ భావద్వేగానికి లోనయ్యారు. బరువెక్కిన హృదయంతో ఈ కార్యక్రమానికి వచ్చా మా మామ అత్త తమ కుమారుడిని తలుచుకుని రోజు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మీరే నా బలం అంటూ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి గద్గద స్వరంతో మాట్లాడారు. గిర్డిలో జార్ఖాండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు కల్పనా సోరెన్ ప్రకటించారు.

జార్ఖాండ్ గ్రౌండ్స్‌లో జేఎంఎం 51వ వ్యవస్థాపక దినోత్సవాన్ని 'అక్రోష్ దివస్'గా నిర్వహించారు. ''ఈ రోజు నా పుట్టినరోజు. అత్తమామల ఆశీస్సులు తీసుకున్నాను, నా భర్తను కూడా ఉదయం కలుసున్నాను'' అని కల్పనా సోరెన్ సోమవారం ఒక ట్వీట్‌లో తెలిపారు. అనంతరం జేఎంఎం 'ఫౌండేషన్‌ డే'లో ఆమె పాల్గొన్నారు. జార్ఖాండ్ ప్రజల అభీష్టం మేరకే తాను ప్రజాజీవితంలోకి అడుగుపెట్టానని, హేమంత్ సోరెన్ తిరిగి వచ్చేంత వరకూ ఆయన ఆలోచనలు, ప్రజాసేవను తాను కొనసాగిస్తానని చెప్పారు. జేఎంఎం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అయిన హేమంత్ సోరెన్‌ను మనీలాండరింగ్ కేసులో ఈడీ జనవరి 31న అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

Updated : 4 March 2024 2:39 PM GMT
Tags:    
Next Story
Share it
Top