Home > జాతీయం > మళ్లీ సొంత గూటికి చేరుకున్నా మాజీ సీఎం జగదీశ్‌ శెట్టర్‌

మళ్లీ సొంత గూటికి చేరుకున్నా మాజీ సీఎం జగదీశ్‌ శెట్టర్‌

మళ్లీ సొంత గూటికి చేరుకున్నా మాజీ సీఎం జగదీశ్‌ శెట్టర్‌
X

కర్ణాటక రాజీయాల్లో ఆసక్తికర పరిణామం నెలకొంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్ సొంతగూటికి చేరుకున్నారు. ఢిల్లీ సెంట్రల్ బీజేపీ ఆఫీసులో సీనియర్ నేత యడ్యూరప్ప సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. కాగా గత ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారనే విశ్వాసం ఉందన్నారు. పార్టీలోకి రావాలని యడియూరప్ప, ఇతర సీనియర్‌ నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు కోరడంతో సొంత గూటికి చేరాని శెట్టర్ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన శెట్టర్‌.. కాంగ్రెస్‌లో చేరారు. హుబ్బళ్లి- ధార్వాడ సెంట్రల్‌ నుంచి హస్తం పార్టీ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక్కడ బీజేపీ నేత మహేశ్‌ 35వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో డబ్బులు పంచారంటూ ఆరోపణలు చేసిన ఆయన.. ఏడాది తిరగకముందే సొంతగూటికి చేరడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పేరు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గం నుంచి ఆయనకు కాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శి మహేశ్‌కి టెకెట్‌ కేటాయించింది. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు.జగదీశ్‌ శెట్టర్‌ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యే పైగా వివాదరహితుడు




Updated : 25 Jan 2024 10:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top