Home > జాతీయం > Mamata Banerjee : రాజకీయాల్లోకి మాజీ క్రికెటర్ యూసుఫ్ ప‌ఠాన్..ఆ పార్టీ నుంచి లోక్ సభకు పోటీ

Mamata Banerjee : రాజకీయాల్లోకి మాజీ క్రికెటర్ యూసుఫ్ ప‌ఠాన్..ఆ పార్టీ నుంచి లోక్ సభకు పోటీ

Mamata Banerjee : రాజకీయాల్లోకి మాజీ క్రికెటర్ యూసుఫ్ ప‌ఠాన్..ఆ పార్టీ నుంచి లోక్ సభకు పోటీ
X

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. యూసుఫ్ నేడు ముఖ్యమంత్రి మ‌మ‌త బెన‌ర్జీ స‌మ‌క్షంలో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోల్‌క‌తాలోని బ్రిగేడ్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించిన మెగా ర్యాలీలో ప‌ఠాన్.. టీఎంసీ కండువా క‌ప్పుకున్నారు. ఇదే వేదిక నుంచి మ‌మ‌త ఎంపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం బెహ‌రంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రి లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు బెంగాల్‌లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేదు.

ఐదు సార్లు ఎంపీగా ఎన్నికైన అధిర్ రంజ‌న్ చౌద‌రీ.. ఈసారి కూడా ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ త‌మ పార్టీ ఎంపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. మొత్తం 42 లోక్‌స‌భ స్థానాల‌కు ఆమె అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. టీమిండియా మాజీ క్రికెట్ యూసుఫ్ ప‌ఠాన్ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. యూసుఫ్ పఠాన్ బెహ‌రంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగ‌నున్న‌ట్లు మ‌మ‌త పేర్కొన్నారు. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ టీమ్‌ మెంబర్‌ యూసుఫ్‌ పఠాన్‌ పేరు ఉండటం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఎలాంటి ప్రకటన చేయకుండానే.. డైరెక్ట్‌గా ఎంపీ టిక్కెట్టు పొందారు. యూసుఫ్‌ సోదరుడు ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా టీమిండియాకు ఆడిన విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి చాలా కాలం పాటు భారత జట్టుకు ఆడారు. అలాగే కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ టీమ్‌కు ఆడిన యూసుఫ్‌ పఠాన్‌ కోల్‌కత్తా ప్రజలకు దగ్గరయ్యాడు.




Updated : 10 March 2024 10:11 AM GMT
Tags:    
Next Story
Share it
Top