Home > జాతీయం > కాంగ్రెస్‌కు షాక్ ..మాజీ మంత్రి రాజీనామా : Baba Siddique

కాంగ్రెస్‌కు షాక్ ..మాజీ మంత్రి రాజీనామా : Baba Siddique

కాంగ్రెస్‌కు షాక్ ..మాజీ మంత్రి రాజీనామా : Baba Siddique
X

మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్దిఖ్ హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. దాదాపు 48 సంవత్సరాల ప్రయణాన్నికి ముగింపు పలుకుతున్నట్లు ట్వీట్టర్ ఎక్స్ ద్వారా తెలిపారు. వాండే పశ్చిమ విధాన సభ నియోజకవర్గానికి శాసన సభ్యుడుగా సిద్దిఖ్ పని చేశారు.ఇటీవల మహారాష్ట్ర కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ మాజీ మంత్రి మిలింద్‌ దేవరా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మిలింద్ కూడా సీనియర్ నాయకుడే. ఆయన తర్వాత మరో సీనియర్ నేత సిద్ధిఖ్ పార్టీని వీడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారానికి దూరంగా ఉండటంతోపాటు సాధారణ ఎన్నికల్లో మళ్లీ గెలిచే అవకాశం లేకపోవడంతో పార్టీ సీనియర్‌ నాయకులు ఒక్కొక్కరిగా తమదారి తాము చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని పార్టీలో సిద్ధిక్ చేరతారని భావిస్తున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకులు చెప్పిన కొద్ది రోజులకే ఈ పరిణామం జరిగింది. ఫిబ్రవరి 1న ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవార్‌తో సిద్ధిక్‌, ఆయన కుమారుడు ఎమ్మెల్యే జీషన్‌ భేటీ అయిన తర్వాత ఎన్‌సీపీ నేతలు ఊహాగానాలు నిజం చేశారు. బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సిద్ధిక్ మాజీ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ముంబై విభాగానికి ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆయన విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. మొదట బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు.సిద్ధిక్ 1999, 2004 మరియు 2009లో బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ చేతిలో ఓడిపోయారు.

Updated : 8 Feb 2024 6:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top