Home > జాతీయం > రాజ్యసభకు.. వీల్ చెయిర్లో మాజీ ప్రధాని

రాజ్యసభకు.. వీల్ చెయిర్లో మాజీ ప్రధాని

రాజ్యసభకు..  వీల్ చెయిర్లో మాజీ ప్రధాని
X

కాంగ్రెస్ పార్టీ కురువృద్ధులు, కీలక నేత, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (90).. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధత ప్రగాఢమైన స్ఫూర్తిని మరోసారి చాటుకున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. వీల్ చెయిర్ తో పార్లమెంట్ సభలకు హాజరయ్యారు. ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023పై చర్చ జరుగుతున్న కీలక సెషన్‌లో పాల్గొన్న ఆయన.. ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆయనతో పాటు జార్ఖండ్ ముక్తిమోర్చా నాయకుడు శిబు సోరెన్ (79) కూడా వీల్ చెయిర్ లో పార్లమెంట్ కు హాజరయ్యారు. ఆసుపత్రిలో ఉన్న జేడీ(యూ) నేత వశిష్ట నారాయణ్ సింగ్ అంబులెన్స్ లో రాజ్యసభకు చేరుకున్నారు. వీరంతా ఢిల్లీ ఆర్డినెస్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయగా.. దానికి అనుకూలంగా 131 ఓట్లు రావడంతో బిల్లు ఆమోదం పొందింది.


Updated : 8 Aug 2023 8:25 AM IST
Tags:    
Next Story
Share it
Top