Home > జాతీయం > కాంగ్రెస్ పార్టీ షాక్.. కీలక నేత రాజీనామా

కాంగ్రెస్ పార్టీ షాక్.. కీలక నేత రాజీనామా

కాంగ్రెస్ పార్టీ షాక్..  కీలక నేత రాజీనామా
X

మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా పార్టీకి రాజీనామా చేశారు. సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో ఆయన చేరనున్నారు. ఇండియా కూటమి సీట్ల పంపకాలపై అసంతృప్తికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘‘ఇవాళ్టితో నా రాజకీయ ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి ఉన్న 55 ఏళ్ల బంధం ముగిసింది. ఇన్నాళ్లు నాకు సహకరించిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు’’ అని మిలింద్ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత మరళీ దేవర కొడుకే మిలింద్ దేవర. 2004, 2009 ఎన్నికల్లో ముంబయి సౌత్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో భాగంగా ముంబై సౌత్ లోక్ సభ స్థానాన్ని ఉద్ధవ్ థాక్రే పార్టీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మిలింద్.. ఇవాళ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాగా మిలింద్ రాజీనామాపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

Updated : 14 Jan 2024 10:38 AM IST
Tags:    
Next Story
Share it
Top