Home > జాతీయం > పార్లమెంటు భద్రతా వైఫల్యం.. నలుగురు నిందితుల అరెస్ట్..

పార్లమెంటు భద్రతా వైఫల్యం.. నలుగురు నిందితుల అరెస్ట్..

పార్లమెంటు భద్రతా వైఫల్యం.. నలుగురు నిందితుల అరెస్ట్..
X

పార్లమెంటులో భద్రతా వైఫల్యం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని సమీక్షించేందుకు హోం సెక్రటరీతో పాటు ఢిల్లీ సీపీ పార్లమెంటుకు చేరుకున్నారు. దాడి నేపథ్యంలో పార్లమెంటులో విజిటర్ పాస్లను స్పీకర్ రద్దు చేశారు. మరోవైపు దాడికి పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని హర్యానా, మహారాష్ట్ర, కర్నాటకకు చెందిన వారిగా గుర్తించారు. నిందితుల్లో నీలం హర్యానాలోని హిస్సార్ చెందిన మహిళ కాగా.. అమోల్ షిండే మహారాష్ట్రలని లాతూర్, సాగర్ శర్మ, దేవ్ రాజ్ కర్నాటకలోని మైసూరుకు చెందిన వారని పోలీసులు ప్రకటించారు.

లోక్ సభలో జరిగిన ఘటనపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని అన్నారు. ఇద్దరు నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ఆయన.. వారివద్దనున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరిపించే బాధ్యత తనదని ఓం బిర్లా స్పష్టం చేశారు. ప్రాథమిక విచారణలో అది సాధారణ పొగ అని తేలిందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు.

లోక్ సభలో భద్రతా వైఫల్యంపై సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. 2001లో పార్లమెంటు బిల్డింగుపై ఉగ్రదాడిలో అమరులైన వారికి నివాళి అర్పించిన రోజే సభ లోపల ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఇది భద్రతా వైఫల్యాన్ని గుర్తు చేస్తోందని అన్నారు. ఎంపీలంతా ఎంతో ధైర్యంగా ఆ ఇద్దరు నిందితుల్ని పట్టుకున్నారని, అయితే ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఏమైపోయారని ప్రశ్నించారు.




Updated : 13 Dec 2023 3:53 PM IST
Tags:    
Next Story
Share it
Top