Home > జాతీయం > దోమల లిక్విడ్ రీఫిల్ పేలి నలుగురు మృతి.. బీ కేర్‌ఫుల్

దోమల లిక్విడ్ రీఫిల్ పేలి నలుగురు మృతి.. బీ కేర్‌ఫుల్

దోమల లిక్విడ్ రీఫిల్ పేలి నలుగురు మృతి.. బీ కేర్‌ఫుల్
X

చిన్నపాటి అజాగ్రతలు నిండు ప్రాణాలను బిలితీసుకుంటున్నాయి. 20 కేజీల గ్యాస్ సిలిండర్లే కాదు 50 ఎంఎల్ మస్కిటో లిక్విట్ రీఫీల్స్ కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఓ ఇంట్లో దోమల లిక్విడ్ రీఫిల్ పేలి నలుగురు చనిపోయారు. మృతుల్లో ఒక వృద్ధురాలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

తమిళనాడు రాజధాని చెన్నైలోని మనలీ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిందీ ఘోరం. మథూర్ కాలనీలో ఓ కుటుంబం రాత్రి మస్కిటో రీఫిల్ పెట్టుకుని నిద్రపోయింది. విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్ల రీఫిల్ పేలిపోయింది. మంటలు బట్టలకు అంటుకోవడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. పక్కింటివారు గమనించి తలుపు కొట్టగా స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపు బద్దలు కొట్టడా నలుగురు స్పృహతప్పి కనిపించారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక చనిపోయినట్లు భావిస్తున్నారు. దోమల మందు బాటిల్ పేలిపోవడం, కరెంట్లు వైర్లు కాలిపోవడంతో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ఇంట్లోని గ్యాస్ సిలిండర్ మాత్రం పేలలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదంతో సంతానలక్ష్మి అనే వృద్ధారాలు, పదేళ్ల వయసులోపున్న ఆమె ముగ్గురు మనవరాళ్లు సంధ్య, ప్రియరక్షిత, పవిత్ర చనిపోయారు.

Updated : 19 Aug 2023 2:14 PM IST
Tags:    
Next Story
Share it
Top