మోదీకి షాక్.. 1.5 లక్షల కోట్ల ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ఫాక్స్‌కాన్
X
ప్రముఖ అంతర్జాతీయ ఎలాక్ట్రానిక్ దిగ్గగం ఫాక్స్‌కాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఏర్పాటు కానున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించింది. దీనికి కారణాలేమిటో వివరించలేదు. ఈ నిర్ణయంతో మేకిన్ ఇండియా ప్రాజెక్టుకు, మోదీ ప్రతిష్టలకు దెబ్బ తగింది.
తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ (హోన్ హయ్ టెక్నాలజీ గ్రూప్) మన దేశానికి చెందిన వేదాంత కంపెనీతో కలసి గుజరాత్‌లోని ధోలెరా సెజ్‌లో సెమీకండక్టర్ల ఫ్యాక్టరీని స్థాపించాలని నిర్ణయించుకున్నాయి. దీని కోసం ఏడాదికిపైగా కసరత్తు సాగుతోంది. తాము ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నామని, ఇక వేదాంతే చూసుకుంటుందని ఫాక్స్‌కాన్ తెలిపింది. గుజరాత్ ప్రభుత్వం 200 ఎకరాల స్థలం కొనుగోలుపై 75 శాతం సబ్సడీతోపాటు పలు పన్ను రాయితీలు ప్రకటించినా ఫాక్స్‌కాన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీనిపై వేదాంత గ్రూప్, కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.