Home > జాతీయం > Emmanuel Macron : భారత విద్యార్థుల కోసం ఒక నెట్వర్క్ను సృష్టిస్తాం: ఫ్రాన్స్ ప్రధాని మాక్రాన్‌

Emmanuel Macron : భారత విద్యార్థుల కోసం ఒక నెట్వర్క్ను సృష్టిస్తాం: ఫ్రాన్స్ ప్రధాని మాక్రాన్‌

Emmanuel Macron : భారత విద్యార్థుల కోసం ఒక నెట్వర్క్ను సృష్టిస్తాం: ఫ్రాన్స్ ప్రధాని మాక్రాన్‌
X

భారత విద్యార్థులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న రోజుల్లో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్ కు వచ్చి చదువుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2030 నాటికి దాదాపు 30 వేలమందికి పైగా విద్యార్థులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ చెప్పారు. దీనిద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని తన అధికారికి ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. భారత్ లో తన పర్యటన.. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మాక్రాన్ ధీమా వ్యక్తం చేశాడు. ‘ఫ్రెంచ్ ఫర్ ఆల్, ఫ్రెంచ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్’ చొరవతో యూనివర్సిటీల్లో ఫ్రెంచ్ భాష నేర్చుకునేందుకు ఒక నెట్వర్క్ ను సృష్టిస్తామని, ఫ్రెంచ్ మాట్లాడలేని వారికోసం అంతర్జాతీయ తరగతులను ఏర్పాటుచేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ఫ్రాన్స్ లో చదివిన పూర్వ విద్యార్థులకు వీసా సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేశారు.






Updated : 26 Jan 2024 2:05 PM IST
Tags:    
Next Story
Share it
Top