భారత్కు గౌరవం.. ప్రధానికి అరుదైన ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
X
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి.. ఆ దేశ అరుదైన అత్యున్నత పురస్కారం దక్కింది. ఎలిసీ ప్యాలెస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఈ పురస్కారాన్ని మోదీకి అందజేశారు. అక్కడి సైనికులకు ఇచ్చే అత్యున్నత గౌరవంగా ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్’ను పిలుస్తారు. దీంతో ఈ గౌరవం అందుకున్న తొలి భారత్ ప్రధానిగా, పౌరునిగా మోదీ నిలిచారు. ఈ వేడుక తర్వాత మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రైవేట్ డిన్నర్ ఏర్పాటుచేశారు.
ఫ్రాన్స్ దేశం.. అన్ని రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రముఖులకు.. ప్రతి సంవత్సరం ఈ అత్యున్నత పురస్కారంతో సత్కరిస్తుంది. ఏటా 300 మంది విదేశీ ప్రముఖులను ఎంపిక చేసి ఈ అవార్డు అందిస్తుంది. అయితే, మోదీ తీసుకున్న‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్’ పురస్కారం.. అత్యుత్తమ అంతర్జాతీయ అవార్డుల్లో ఒకటి. ఎరుపు రంగు రిబ్బన్ కు దిగువన పుష్పగుచ్ఛం ఉంటుంది. దానిపై ఐదు బ్యాడ్జీలు ఉంటాయి. దాని వెనుకవైపు ఫ్రెంచ్ భాషలో ‘హానర్ అండ్ ఫాదర్ల్యాండ్’ అని రాసి ఉంటుంది.