Home > జాతీయం > Free Meals For Devotees : అయోధ్యలో భక్తులకు ఉచిత ఆహారం

Free Meals For Devotees : అయోధ్యలో భక్తులకు ఉచిత ఆహారం

Free Meals For Devotees : అయోధ్యలో భక్తులకు ఉచిత ఆహారం
X

అయోధ్య రామ‌మందిరం ప్రాణ‌ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావ‌త్ భార‌త‌దేశం ఎదురుచూస్తోంది. జ‌న‌వ‌రి 22వ తేదీన‌ ప్రాణ‌ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా కొన‌సాగ‌నుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే దేశంలోని రాజ‌కీయ‌, పారిశ్రామిక‌, సినీ, క్రీడా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌కు శ్రీరామ జ‌న్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపింది.ఈ మ‌హోత్తర వేడుక‌కు దాదాపు 8 వేల మంది ప్రముఖులతోపాటు, అశేష సామాన్య జనం కూడా హాజ‌రయ్యే అవ‌కాశం ఉంది. ఈనేపథ్యంలో రామమందిర ప్రారంభోత్సవం తర్వాత దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించేందుకు వీలుగా సామాజిక వంటశాలలు ఏర్పాటు చేశారు.





రామమందిర ప్రారంభోత్సవం కోసం అయోధ్యకు వచ్చే భక్తులకు తమ వంతు సాయంగా(విరాళంగా) ఉచిత ఆహారం ఏర్పాటు చేయాలని పలు సామాజిక సంస్థలతో పాటు కొన్ని హైందవ సంఘాలను గత అక్టోబర్‌లో ఆలయ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. దీంతో అస్సాం మరియు దక్షిణ భారతదేశం నుండి టీ మరియు సుగంధ ద్రవ్యాలు, ఉత్తర ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల నుండి బియ్యం, కాన్పూర్ మరియు గోండా నుండి చక్కెర, హర్యానా మరియు మధ్యప్రదేశ్ నుండి బియ్యం వంటి ఆహార సామాగ్రి అయోధ్యకు చేరుకున్నాయి. అయోధ్య ఆలయానికి సమీపంలో గల ప్రతీ వీధిలో నిహాంగ్ సింగ్స్, ఇస్కాన్ వంటి సామాజిక సంస్థలు.. భక్తులకు ఉచిత ఆహార ఏర్పాట్లను చేశాయి. రాంకీరసోయ్ నుంచి లంగర్ వరకు వంటశాలలను ఏర్పాటు చేశాయి.





భక్తులకు ఇచ్చే ఆహారంలో.. ఉదయం వేళలో గరమ్ చాయ్, కిచిడీ, ఆలూ పూరీ.. మధ్యాహ్న సమయంలో కధీ చావల్‌, ఆచార్‌, పాపడ్‌లు మాత్రమే కాకుండా ఇతర రుచికర పదార్థాలను అప్పటికప్పుడే వండి.. భక్తులకు వేడివేడిగా అందించనున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండటంతో ప్రతీ చోటా వేడి టీనీ భక్తులకు ఇస్తారు. బాబా హర్జీత్‌సింగ్‌ రసూల్‌పుర్‌ నేతృత్వంలో నిహాంగ్‌ సిక్కుల గ్రూపు శుక్రవారం అయోధ్య చేరుకుంది. ఛార్‌ధామ్‌ మఠ్‌లో వారు 2 నెలలపాటు లంగర్‌ను ఏర్పాటు చేసి ఆహారాన్ని అందించనున్నారు. పట్నాకు చెందిన మహావీర్‌ ఆలయ ట్రస్టు రోజుకు 10,000 మందికి ఆహారాన్ని అందించేలా రాం కీ రసోయ్‌ వంట గదిని సిద్ధం చేసింది. ఇస్కాన్‌ మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. రోజుకు 5,000 మందికి ఆహారాన్ని అందించనుంది.







Updated : 21 Jan 2024 7:55 AM IST
Tags:    
Next Story
Share it
Top