Home > జాతీయం > Google Meet Call : 2 నిమిషాల కాల్‌.. 200 మంది ఉద్యోగులు ఔట్

Google Meet Call : 2 నిమిషాల కాల్‌.. 200 మంది ఉద్యోగులు ఔట్

Google Meet Call : 2 నిమిషాల కాల్‌.. 200 మంది ఉద్యోగులు ఔట్
X

టెక్ సంస్థలో ఉద్యోగుల తొలగింపు పరంపర (layoffs) కొనసాగుతూనే ఉంది. ఉద్యోగుల భవిష్యత్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా నిర్ధాక్షణంగా సంస్థలు సిబ్బందిని తొలిగిస్తున్నాయి. గతేడాది జూమ్ కాల్ లో ఒక కంపెనీ తన ఉద్యోగులను తొలగించెదనే వార్త ప్రపంచవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమైందో అందరికి తెలిసిందే. తాజాగా మరో కంపెనీ ఈవిధంగానే ఉద్యోగులను తొలిగించింది.ఫ్రంట్‌ డెస్క్ అనే కంపెనీ రెండు నిమిషాల గూగుల్ మీట్‌లో 200 ఉద్యోగులకు ఉద్వాసన (layoffs) పలికింది. తొలిగించిన వారిలో ఫుల్‌టైమ్‌ ఉద్యోగులు, పార్ట్‌ టైమ్‌ వర్కర్లు, కాంట్రాక్టర్ ఉద్యోగులు ఉన్నారు.

కంపెనీ సీఈఓ ఏమన్నారంటే..

గూగుల్‌ మీట్‌ కాల్‌లో ఫ్రంట్‌డెస్క్ సీఈఓ జెస్సీ డిపింటో మాట్లాడుతూ.. కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. త్వరలోనే దివాలా దరఖాస్తుకు కూడా చేసుకోవచ్చు. సంస్థ వ్యాపార నిర్వహణలో ఇబ్బందులు పడుతోంది. జెట్ బ్లూ వెంచర్స్, వెరిటాస్ ఇన్వెస్ట్ మెంట్స్ వంటి ఇన్వెస్టర్ల నుంచి దాదాపు 26 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించినప్పటికీ కంపెనీ ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉంది. ప్రస్తుతం అద్దె చెల్లింపుల వంటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కుంటుంది. కాబట్టి ఉద్యోగుల తొలగింపు అనివార్యమైందని తెలిపారు.

స్టార్టప్ ఫ్రంట్‌డెస్క్ సంస్థ 2017లో స్థాపించారు. ఈ కంపెనీకి అమెరికాలో 1,000కు పైగా అపార్ట్‌మెంట్‌లను నిర్వహించిన అనుభవం ఉంది. ఈ సంస్థ ఇటీవల విస్కాన్సిన్ కు చెందిన పోటి సంస్థ అయిన జెన్ సిటీని కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ప్రక్రియ జరిగిన కేవలం ఏడు నెలల తర్వాత ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నారు. అద్దె చెల్లించడం కష్టంగా మారడంతో సంస్థ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొందని యాజమాన్యం వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో సంస్థ ఉద్యోగులను తొలిగించినట్లు వెల్లడించింది.

జిరాక్స్ సంస్థలోనూ లేఆఫ్స్

జనవరి 3న జిరాక్స్ తన ఉద్యోగుల సంఖ్యను 15 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థలో 20,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ లేఆఫ్ ప్రకటనతో సుమారు 3000 మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ఈ యుఎస్ కంపెనీ డిజిటల్ ప్రింటింగ్, డాక్యుమెంట్ మేనేజ్ మెంట్ టెక్నోలో ఆపరేషన్స్ నిర్వహిస్తుంది.

Updated : 6 Jan 2024 7:31 AM IST
Tags:    
Next Story
Share it
Top