Home > జాతీయం > Petrol Strike : పెట్రోల్ పంపుల వద్ద భారీగా క్యూలైన్లు.. రీజన్ ఏంటంటే..?

Petrol Strike : పెట్రోల్ పంపుల వద్ద భారీగా క్యూలైన్లు.. రీజన్ ఏంటంటే..?

Petrol Strike : పెట్రోల్ పంపుల వద్ద భారీగా క్యూలైన్లు.. రీజన్ ఏంటంటే..?
X

దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు సమ్మె కొనసాగుతోంది. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి క్రిమినల్ కోడ్ చట్టాల్లో చేసిన మార్పులపై వారు ఆందోళన బాటపట్టారు. భారతీయ న్యాయ సంహిత-2023 క్రిమినల్‌ కోడ్‌ చట్టం ప్రకారం హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో గరిష్ఠంగా పదేండ్ల జైలు శిక్ష, రూ.7లక్షల వరకు జరిమానా విధించనున్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని లేదా శిక్షను తగ్గించాలని దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు సోమవారం నుంచి మూడు రోజులు ధర్నాకు దిగారు. వేల మంది ట్రక్కు డ్రైవర్లు రోడ్లపైకి వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు.

ట్రక్కు డ్రైవర్ల నిరసన ప్రభావం పెట్రోల్ పంపుల వద్ద స్పష్టంగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో జనంలో ఆందోళన మొదలైంది. ఇంధన కొరత ఏర్పడుతుందన్న భయంతో

జనం పెట్రోల్‌ బంకులకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, హిమాచల్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, జమ్మూ కశ్మీర్‌, లడఖ్ తదితర రాష్ట్రాల్లోని పెట్రోల్‌ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.




Updated : 2 Jan 2024 7:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top