Home > జాతీయం > రేపు భారత్ బంద్.. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు

రేపు భారత్ బంద్.. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు

రేపు భారత్ బంద్.. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు
X

ఆందోళనలు చేస్తున్న రైతులపై దాడులను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్ధూర్ మోర్చా రేపు గ్రామీణ భారత్ బంద్‌కి పిలుపునిచ్చిన తెలిసిందే. దీనికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. కనీస మద్దతు ధరకి చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించిన రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఈ నెల 16న గ్రామీణ భారత్‌బంద్‌కు పిలుపునిచ్చారు. తమ సమస్యలను ప్రజలకు వివరించి, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే భారత్‌బంద్‌కు పిలుపునిచ్చినట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ప్రకటించింది. ఈ బంద్‌కు పలు కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.

రైతులు కనీసం గిట్టుబాటు ధర కోసం డిమాండ్ చేస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధర, కొనుగోలుకు చట్టబద్ధమైన హామీ, రుణమాఫీ, విద్యుత్తు పెంపు నిలుపుదల వంటి డిమాండ్లను అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. దీంతోపాటు గృహావసరాలకు, దుకాణాలకు వ్యవసాయానికి ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్తు, సమగ్ర పంటల బీమా, నెలకు రూ.10 వేల పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అందుకే ఈ ఉద్యమం చేపట్టాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత్ బంద్ రోజున కూరగాయలు, ఇతర పంటల సరఫరాపై కూడా ప్రభావితం ఉండవచ్చు. శుక్రవారం భారత్ బంద్ సందర్భంగా అంబులెన్స్, పెళ్లిళ్లు, మెడికల్ షాపులు, పాఠశాలలు, పరీక్షలు తదితర అత్యవసర సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదు. అంతే కాకుండా బ్యాంకులు కూడా తెరిచి ఉంటాయి.


Updated : 15 Feb 2024 10:21 PM IST
Tags:    
Next Story
Share it
Top