Home > జాతీయం > మళ్లీ బీజేపీ గూటికి మైనింగ్ కింగ్.. పార్టీ విలీనం

మళ్లీ బీజేపీ గూటికి మైనింగ్ కింగ్.. పార్టీ విలీనం

మళ్లీ బీజేపీ గూటికి మైనింగ్ కింగ్.. పార్టీ విలీనం

మళ్లీ బీజేపీ గూటికి మైనింగ్ కింగ్.. పార్టీ విలీనం
X

లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ కర్నాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డి తన పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ)ని బీజేపీలో విలీనం చేశారు. ఈ క్రమంలో జనార్థన్‌ రెడ్డితో పాటు ఆయన భార్య కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించేందుకు బీజేపీ కార్యకర్తనై పనిచేస్తానని అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేరానని, అంతేకానీ ఏ పదవులు ఆశించి కాదని చెప్పుకొచ్చారు. కాగా ఆయన చేరికను కర్నాటన బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడియూరప్ప స్వాగతించారు.

గాలి జనార్ధన్ రెడ్డి బీజేపీలో చేరడం మంచి నిర్ణయమని యడియూరప్ప అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ కర్నాటకలోని 28 స్థానాల్లో విజయం సాధింస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో గాలి జనార్ధన్ కు బీజేపీ టికెట్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు బి. శ్రీరాములుకు మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన గాలి.. అక్రమ గనుల తవ్వకాలకు పాల్పడ్డారని సీబీఐ 2011లో అరెస్ట్ చేసింది. బెయిల్ పై బయటికి వచ్చిన ఆయన రాజకీయాల్లో కనసాగినా.. గతంలో లాగ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

Updated : 25 March 2024 8:26 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top