కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్న గంగమ్మ
X
ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలతో జన జీవితాలు అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. రోడ్లు మూసుకుపోయాయి. మరోవైపు గంగ, యమున నదులు ఇంకా ప్రమాదకర స్థాయికి మంచే ప్రవహిస్తున్నాయి.
ఉత్తరాఖండ్ లో గంగానది కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. ఒకరకంగా ఉగ్రరూపం చూపిస్తుందనే చెప్పాలి. భారీ వర్షాలతో అలకనంద నది మీద ఉన్న జీవీకే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డ్యామ్ నిండటంతో దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో దేవప్రయాగలో గంగానది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. వార్నింగ్ స్థాయి 293 మీటర్లను దాటి ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితితో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హరిద్వార్, రూర్కీ, ఖాన్ పూర్, భగవాన్ పూర్, లస్కర్ ప్రాంతాల్లోని వరద నీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు వర్షాలకు చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారులు మూసుకుపోయి...వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. మొత్తం 17 రోడ్లు, 9 వంతెనలు దెబ్బతిన్నాయి. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈరోజు కూడా భారీ వర్ష సూచన ఉందని తెలిపారు. దీంతో ఆరెంజ్ అలర్ట్ ాజరీ చేశారు.
ఇక ఢిల్లీలో తగ్గిందనుకున్న వరద ప్రభావం మళ్ళీ మొదలైంది. యమునా నది మళ్ళీ ఉప్పొంగుతోంది. అంతకంతకూ నీటి మట్టం పెరుగుతోంది. ఢిల్లీలో కూడా మరో రెండు రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు అధికారులు. ఇది మరింత ప్రమాదకరం అని ...యమునా నది నీటి మట్టం మరింత పెరిగే అవకాశ ఉందని చెబుతున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట, రాజ్ ఘాట్ లాంటి ప్రాంతాల్లో వరద నీరు ఇంకా నిలిచే ఉంది.