Home > జాతీయం > ఉదయాన్నే తప్పతాగి స్కూల్‌కి వచ్చిన హెడ్ మాస్టర్

ఉదయాన్నే తప్పతాగి స్కూల్‌కి వచ్చిన హెడ్ మాస్టర్

ఉదయాన్నే తప్పతాగి స్కూల్‌కి వచ్చిన హెడ్ మాస్టర్
X

విద్యార్థులకు మంచి చెడులను గురించి చెబుతూ.. విద్యా బుద్ధులను నేర్పించాల్సిన ఉపాధ్యాయులే బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నారు. పట్టపగలే తప్పతాగి పాఠశాలకు వచ్చి.. నానా యాగీ చేస్తున్నారు. పాఠశాలకు హెడ్ గా తోటి టీచర్స్ కు, స్టూడెంట్స్ కు మార్గదర్శకం చేస్తూ.. ఆదర్శంగా నిలవాల్సిన ఓ ఓ ప్రధానోపాధ్యాయుడి ప్రవర్తన ఉపాధ్యాయ వృత్తికే మచ్చగా మారింది. . ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఒడిశాలోని కేంఝర్‌ జిల్లా హరిచందన్‌పూర్‌ సమితిలో ఉన్న గరదాహాబహా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గా వసంత ముండా పని చేస్తున్నాడు. ఆయన బుధవారం ఉదయం 11 గంటలకు ఫుల్​గా మద్యం తాగి స్కూల్ కు వచ్చాడు. మత్తులో నడవలేని స్థితిలో తరగతి గది ముందు నేలపై దొర్లడం ప్రారంభించాడు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఆ స్కూల్ లో హెడ్ మాస్టర్ వసంత ముండాతోపాటు మరో టీచర్ పనిచేస్తున్నారు. బుధవారం తప్ప తాగి వచ్చిన హెడ్ మాస్టర్.. కనీసం క్లాస్ రూమ్‌లోకి కూడా వెళ్లలేక నేలపై పడిపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఆయనకు సపర్యలు చేశారు. కొందరు ఈ మొత్తం వ్యవహారాన్ని సెల్ ఫోన్ తో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది.




Updated : 29 Sept 2023 10:37 AM IST
Tags:    
Next Story
Share it
Top