ఎంజాయ్ చేసి.. చెత్త చెత్త చేస్తారా?
X
క్రిస్మస్- న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌కు టూరిస్టులు పోటెత్తారు. హిమాలయ అందాలను వీక్షిస్తూ కొత్త ఏడాదికి వెల్‌కం చెప్పడానికి జనాలు హిమాచల్‌కు క్యూ కట్టారు. దీనికోసం రోహ్‌తంగ్‌లోని అటల్ సొరంగం ద్వారా రాకపోకలు సాగించారు. పర్యాటక ప్రాంతాలైన కులు, లాహౌల్-స్పితి లోయలో హిమాలయ అందాలను ఆస్వాదిస్తూ సందడిగా గడిపారు. పకృతి అందాలను ఎంజాయ్ చేశారు కానీ పకృతిని సంరక్షించాలనే సృహను మరిచారు. హిమాలయ లోయలను చెత్తతో నింపేశారు. పకృతి సోయగాలతో మైమరిపించే హిమాలయ లోయను ఇలా చెత్త చేయడంపై నెట్టింట్లో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడి చెత్త కుప్పల దృశ్యాలను ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ అందమైన కొండల్లో మనం వెళ్తున్నది ఏమిటి..! అటల్ సొరంగం ద్వారా ఎన్నో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. మీరు పడేసిన చెత్తను అలా వదిలి వెళ్తే ఎలా..? దానిని మీ వెంట తీసుకెళ్లండి’ అంటూ విమర్శించారు.