Home > జాతీయం > మళ్లీ భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఇవాళ్టి నుంచే అమల్లోకి

మళ్లీ భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఇవాళ్టి నుంచే అమల్లోకి

మళ్లీ భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఇవాళ్టి నుంచే అమల్లోకి
X

రెండు రోజుల క్రితమే గృహ వినియోగ సిలిండర్ ధరలను తగ్గించిన కేంద్రం ఇప్పుడు మరో శుభవార్త అందించింది. 14 కేజీల సిలిండర్ ధరను రూ.200 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించగా.. ఇప్పుడు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను వరుసగా మూడో నెల భారీగా తగ్గించింది. సిలిండర్ రేట్ల తగ్గింపు నిర్ణయం నేటి నుంచే అంటే సెప్టెంబర్ 1 నుంచే అమలులోకి వచ్చింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ రోజు సిలిండర్ ధరలను ఏకంగా రూ. 157 మేర తగ్గించేశాయి. ఇది 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు వర్తిస్తుంది. వ్యాపారులకు ఈ నిర్ణయం వల్ల బెనిఫిట్ కలగొచ్చు.




తాజాగా ప్రకటించిన ధరల తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1522 వద్దకు దిగి వచ్చింది. ఇది వరకు ఈ ధర రూ. 1680గా ఉండేది. ఇక కోల్‌కతాలో సిలిండర్ ధర రూ. 1636కు దిగి వచ్చింది. ఇది వరకు ఈ రేటు రూ. 1802గా ఉంది. ఇంకా ముంబైలో చూసుకుంటే ఈ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1640 నుంచి రూ. 1482కు దిగి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను రెండు రోజుల క్రితమే తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ఆగస్ట్ 30 నుంచే అమలులోకి వచ్చింది. దీని వల్ల 33 కోట్ల మంది లబ్ధిదారులకు ఊరట లభించింది. సిలిండర్ ధర భారీగా తగ్గింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.200 మేర తగ్గించాయి. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ధర ఇప్పుడు రూ. 960కు దిగి వచ్చింది. ఇది వరకు ఈ రేటు రూ. 1160 వద్ద ఉండేది.

అలాగే మరోవైపు ఉజ్వల స్కీమ్ కింద ప్రయోజనం పొందే వారికి అయితే ఇంకా అదనపు బెనిఫిట్ కూడా ఉంది. వీరికి సబ్సిడీ రూపంలో రూ.200 లభిస్తాయి. అంటే సిలిండర్ ధర తగ్గింపు రూ.200, సబ్సిడీ రూ. 200.. మొత్తంగా రూ. 400 తక్కువకే సిలిండర్ ఇంటికి పొందొచ్చు




Updated : 1 Sept 2023 9:09 AM IST
Tags:    
Next Story
Share it
Top