Gautam Gambhir : రాజకీయాలపై గౌతమ్ గంభీర్ సంచలన ప్రకటన
X
గౌతమ్ గంభీర్.. తన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. ముక్కుసూటిగా మాట్లాడడం అతడి నైజం. అటు క్రికెట్, ఇటు రాజకీయాలపై కుండబద్ధలు కొట్టినట్లుగా తన అభిప్రాయాన్ని చెబుతుంటాడు. ప్రస్తుతం ఆయన తూర్పు ఢిల్లీ ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని గంభీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనను రాజకీయ విధుల నుంచి దూరంగా ఉంచాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను గంభీర్ కోరారు.
ఇకపై క్రికెట్పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లు గంభీర్ చెప్పారు. ‘‘రానున్న రోజుల్లో క్రికెట్పై దృష్టి సారిస్తాను. అందుకే తనను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నడ్డాను కోరారు. ఇన్నాళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు’’ అని గంభీర్ ట్వీట్ చేశారు. గంభీర్ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా ఈ సారి ఈస్ట్ ఢిల్లీ టికెట్ గంభీర్ కు కాకుండా వేరేవారికి ఇస్తారని చర్చ నడుస్తోంది. రెండు రోజుల కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై ఎంపీ అభ్యర్థులపై చర్చించింది. దీంతో ఏ క్షణమైన ఫస్ట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే గంభీర్ ఈ విధంగా పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.