Home > జాతీయం > నేటి నుంచి 5 రోజుల పాటు ఆకాశంలో అద్భుతం

నేటి నుంచి 5 రోజుల పాటు ఆకాశంలో అద్భుతం

నేటి నుంచి 5 రోజుల పాటు ఆకాశంలో అద్భుతం
X

ఆకాశంలో అప్పుడప్పుడూ ఉల్కాపాతాలు కనువిందు చేస్తుంటాయి. నేటి నుంచి 5రోజుల పాటు ఆకాశంలో జెమినిడ్ ఉల్కాపాతం కనువిందు చేయనుంది. దీనిని ప్రజలు నేరుగా చూడొచ్చు. డిసెంబరు 16 నుంచి 20 వరకూ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కాంతివంతమైన ఉల్కాపాతాలు కనిపిస్తాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ డైరెక్టర్ శ్రీ రఘునందన్ కుమార్ తెలిపారు. ఫేథాన్ అనే గ్రహశకలం సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో భూకక్ష్యలోకి ప్రవేశించిందని.. ఇది కొన్ని పదార్థాలతో కలిసి రాపిడికి గురై చిన్న చిన్న ఉల్కలుగా రాలిపడుతుందని చెప్పారు. ఈ క్రమంలో ఇవి గంటకు 150 కాంతి పుంజాలను వెదజల్లుతాయని ఐఎంఓ తెలిపింది. ఈ ఉల్కాపాతాలు చూసిన వారు ఫొటోలు, వీడియోలను తీసి ఐఎంఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయొచ్చని వివరించింది. ఈ ఉల్కాపాతాల వల్ల భూమికి ఎటువంటి నష్టం లేదని స్పష్టం చేసింది.


Updated : 16 Dec 2023 10:32 AM IST
Tags:    
Next Story
Share it
Top